బిగ్ బాస్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరన్నది.. ఎలా ఉంటుందోనని క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోను నెలకొంది. భారీ అంచనాల మధ్య మొదలవుతున్న ఈ రియాలిటీ షోకి రేటింగ్ లో కూడా టాప్ లో ఉంటుంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం కంటెస్టెంట్స్ అందరూ దాదాపు ఫైనల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ లిస్ట్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ తో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య బిగ్ బాస్ సీజన్-7కి సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది.
వైష్ణవి చైతన్య యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి నటించగా అది అత్యధిక వీక్షకాధరణ పొందింది. దాంతో వైష్ణవి పాపులర్ అయింది. కాగా ఇప్పుడు తనెవరో తెలియని వారంటూ ఉండరని చెప్పాలి. తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ.. ఇప్పుడు బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వైష్ణవి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జన్మించింది. యాక్టింగ్ మీద ఆసక్తితో మొదటగా లిప్ సింక్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించినవారిలో వైష్ణవి ఒకరు. వైష్ణవిలో టాలెంట్ చూసి ఒక ప్రొడక్షన్ సంస్థ కొన్ని వెబ్ సిరీస్ ల కి అవకాశం ఇచ్చింది. తను చేసిన మొట్టమెదటి వెబ్ సిరీస్ సామాజవరగమన. ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురం' మూవీలో హీరోకి చెల్లెలిగా చేసి పర్వాలేదనిపించింది. దాని తర్వాత వరుడు కావలెను మూవీలో సపోర్టింగ్ రోల్ చేసి అందరిని మెప్పించింది. వైష్ణవి సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ ఉండే ఈ భామ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చాలా మంది యూట్యూబర్స్ షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిని ప్రోత్సాహిస్తూ అవకాశం ఇస్తున్న బిగ్ బాస్.. మరి మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవిని తీసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు వైష్ణవి బిగ్ బాస్ సీజన్ -7 కి సెలెక్ట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.